Header Banner

బంగాళాఖాతంలో అల్పపీడనం! రాబోయే 48 గంటలు కీలకం.. ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక!

  Tue Apr 08, 2025 07:41        Others

ఐఎండి సూచనల ప్రకారం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు(07-04-25) ఉదయం 08.30 గంటలకు దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఇది రేపటి(ఏప్రిల్ 8) వరకు వాయువ్య దిశగా నైరుతి బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉందని ఆ తర్వాత 48 గంటల్లో ఉత్తర దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపుగా కదిలే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో గురు,శుక్రవారాల్లో (10, 11 తేదీల్లో) ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రేపు, ఎల్లుండి(ఏప్రిల్ 8, 9) అకస్మాత్తుగా పిడుగులతో కూడిన అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


ఇది కూడా చదవండిఓరి దేవుడా.. ఓక పక్క ఎండలు మండుతుంటే.. ఈ అకాల వర్షాలు ఏంటి? వారికి వాతావరణ శాఖ హెచ్చరిక!


సోమవారం నంద్యాలలో 41.5°C, కర్నూలు(D) నడిచాగిలో 41.1°C, వైఎస్సార్(D) బలపనూరులో 41°C, ప్రకాశం(D) నందనమారెళ్ళలో 40.8°C, తిరుపతి(D) గూడూరు, విజయనగరం(D) నెలివాడలో 40.6°C, చిత్తూరు(D) నగరిలో 40.5°C, అన్నమయ్య(D) కంభంవారిపల్లె 40.4°C, పల్నాడు(D) రావిపాడులో 40°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు. వైఎస్సార్ జిల్లాలో 14, నంద్యాల జిల్లాలో 10చోట్ల, ఇతర జిల్లాల్లో 15, మొత్తంగా కలిపి 39 చోట్ల 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు వెల్లడించారు. ఎండతీవ్రంగా ఉండి బయటకు వెళ్లేప్పుడు తలకు టోపి, కర్చీఫ్ కట్టుకోవాలి, గొడుగు ఉపయోగించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని సూచించారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #BayOfBengal #WeatherAlert #IMDWarning #RainForecast #Thunderstorms